- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2024-25 సంత్సర తాత్కాలిక బడ్జెట్‌లో అఇనీతి నిరోధక అంబుడ్స్‌మెన్ లోక్‌పాల్‌కు తన నిర్వహణా ఖర్చుల కోసం రూ.33.32 కోట్లు కేటాయించారు. . 2023-24 వార్సిక బడ్జెట్‌లో తొలుత రూ. 92 కోట్లు కేటాయించినప్పటికీ తర్వాత దాన్ని రూ.110.89 కోట్లకు ప్రభుత్వం పెంచింది. కాగా..సెంట్రల్ విజిలిన్స్ కమిషన్(సివిసి)కు తాత్కాలిక బడ్జెట్‌లో రూ.51.31 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2023-24 వార్షిక బడ్జెట్‌లో తొలుత రూ.44.46 కోట్లు కేటాయించి తర్వాత దాన్ని రూ.47.42 కోట్లకు ప్రభుత్వం పెంచింది.
- Advertisement -