Saturday, November 23, 2024

హైదరాబాద్‌పై లండన్ ముద్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ గ్రూప్ పిఎల్‌సి (ఎల్‌ఎస్‌ఇజి) హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. బ్యాకింగ్, ఫైనాన్షి యల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగానికి సంస్థ ఊతమి వ్వనున్నది. ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుతో దాదాపు వెయ్యి మందికి ఉపాధి లభించనున్నది. తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి కెటిఆర్ లండన్‌లో ఎల్‌ఎ స్‌ఇజి గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సిఐఒ) ఆంథో నీ మెక్‌కార్తీతో సమావేశం అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, ఎల్‌ఎస్‌ఇజి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

ఎంఒయుపై ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, మెక్‌కార్తీ సంతకాలు చేశారు. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్‌కు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా ప్రొవైడర్‌గా సేవల ందిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో పని చేయడంతో పాటు 190 దేశాలలో వినియోగదారుల కు సేవలు అందిస్తున్నది. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ వ్యవహా రాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఐటి ఇ అండ్ సి డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అమర్‌నాథ్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News