Friday, December 20, 2024

చాలా రోజుల తరువాత హాయ్ గా నిద్రపోయాను: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంత్రి కెటిఆర్ జోస్యం చెప్పారు. గత 50 రోజుల నుంచి విరామం లేకుండా కెటిఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోలింగ్ పూర్తైన తరువాత ప్రశాంతంగా నిద్రపోయానని మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ కాస్త పెరిగే అవకాశం ఉందని, ఎగ్జాట్ పోల్స్ మాత్రం బిఆర్‌ఎస్ వైపే ఉన్నాయని తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ 70 సీట్లతో గెలుపొందుతుందని కెటిఆర్ పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్‌తో బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఆయోమయానికి గురికావొద్దని సూచించారు. 2018లో ఒక్క ఏజెన్సీ మినహా మిగతావన్నీ తప్పుడు ఫలితాలు ఇచ్చాయని కెటిఆర్ గుర్తు చేశారు. డిసెంబర్ 3న అసలైన ఫలితం వస్తుందని, మరోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దీమా వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News