Monday, December 23, 2024

విద్యుత్ అంతరాయాలు కలగకుండా చూడాలి: ఎన్‌డిసిఎల్ సిఎండి గోపాలరావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గిరి వికాసం లో దరఖాస్తు చేసుకున్న సర్వీసులను వెంటనే మంజూరు చేయాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్( ఎన్‌పిడిసిఎల్ ) సిఎండి అన్నమనేని గోపాల్ అధికారులను ఆదేశించారు. హనుమకోండలోని విద్యుత భవన్‌లో మంగళవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాలు,బ్రేక్ డౌన్స్ , ట్రిప్పింగ్స్ కాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ట్రాన్స్‌ఫార్మర్లలో వైఫల్యాలను తగ్గించాలని, రిపేర్లు ఆలస్యం కాకుండా చూడాలన్నారు.ట్రాన్స్ఫార్మర్ల తరలింపు డిపార్ట్మెంట్ వెహికల్ లోనే చేపట్టాలని, రోలింగ్ స్టాక్ పెంచుకోవాలని సూచించారు. కాలిపోయిన , పనిచేయని మీటర్లను మార్చాలని, మీటర్ రీడింగ్ లను చెక్ చేయాలని అన్నారు .

రెవెన్యూ వసూళ్ల లక్షలను పూర్తి చేయాలని, బిల్లులను సకాలంలో అందించడమే కాకుండా మొండి బకాయిలపై దృష్టి సారించి వసూళ్లను వేగవంతం చేయాలని తెలిపారు ఈ వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున ,ప్రమాదాలు జరగక కుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు.అహర్నిశలు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని వారితో సత్ సంబంధాలు మెరుగు పరుచుకోవాలని అన్నారు. .విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బి.వెంకటేశ్వర రావు, పి.గణపతి, పి.సంధ్యారాణి, పి.మోహన్ రెడ్డి,వి.తిరుపతి రెడ్డి, సి.జి.యంలు అశోక్ కుమార్, సదర్ లాల్, కిషన్, రాజ్ చౌహన్, ఎస్.ఈలు, డీఈలు, ఎస్‌ఏఓలు, నోడల్ జియం లు , డిఈ(ఐటి) అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News