Friday, December 20, 2024

లింగాయత్ మఠాధిపతి శివమూర్తిపై లుక్‌అవుట్ నోటీసు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుఘ శరణారుపై కర్నాటక పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా లుక్ అవుట్ నోటీసు జారీచేశారు. కర్నాటకలోని చిత్రదుర్గలో ఉన్న జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ మఠానికి అధిపతిగా శివమూర్తి మురుఘ శరనారు ప్రస్తుతం ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుడు లేదా చట్టాన్ని అమలుచేసే సంస్థలు వెదుకుతున్న వ్యక్తి దేశాన్ని విడిచివెళ్లకుండా నిరోధించేందుకు లుక్ అవుట్ నోటీసు లేదా సర్కూలర్(ఎల్‌ఓసి) జారీచేస్తారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులు వంటి అన్ని ఇమిగ్రేషన్ చెక్ పాయింట్లకు శివమూర్తిపై లుక్ అవుట్ నోటీసును పోలీసులు జారీచేశారు. కాగా..శివమూర్తి స్వామిపై నమోదైన ఆరోపణలలో అనేక లోపాలు ఉన్నాయని, కోర్టు పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు జరగాలని ఆయన తరఫు న్యాయవాదుల బృందం కోరుతోంది.

Look Out Notice against Lingayat Seer Shivamurthy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News