Sunday, January 19, 2025

లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు… సురేష్‌పై లుక్ అవుట్ నోటీసు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల దాడి ఘటన కేసు మరింత తీవ్రం అవుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఎ1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎ2గా ఉన్న సురేష్ మాత్రం ఇంత వరకు ఆచూకీ లేదు. అందుకే అతని వెతికి పట్టుకునేందుకు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. లగచర్లలో అధికారులపై జరిగిన దాడి కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్టు చేశారు. ఘటన జరిగి వారం రోజులు అవుతున్నప్పటికీ ఇంత వరకు సురేష్ ఆచూకీ లభించకపోవడంపై పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కలే ఆయన్ని దాచి పెట్టి ఉన్నారని ఫోన్ సిగ్నల్‌కి కూడా దొరకడం లేదని అంటున్నారు. అందుకే ఈ వ్యక్తిని పట్టుకోవడం మంరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సోమవారం లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News