Monday, December 23, 2024

నూపుర్ శర్మకు లుక్‌అవుట్ నోటీసు

- Advertisement -
- Advertisement -

Lookout notice for Nupur Sharma

కోల్‌కతా : ప్రవక్త మహమ్మద్‌పై వ్యాఖ్యలు చేసినందుకు బిజెపి బహిష్కృత నాయకురాలు నూపుర్‌శర్మపై కేసు నమోదైన నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. అమ్‌హెరెస్ట్, నార్కెల్ దంగా పోలీస్ స్టేషన్ల ఎదుట హాజరు కావాలని ఆమెను కోరినా హాజరు కాకపోగా, మరింత సమయం ఆమె కోరింది. అనేక సమన్లు జారీ చేసినా పోలీస్ అధికారుల ముందు ఆమె హాజరు కానందున లుక్‌అవుట్ నోటీసు జారీ చేశామని పశ్చిమబెంగాల్ సీనియర్ పోలీస్ అధికారి శనివారం చెప్పారు. కోల్‌కతాకు తాను వస్తే తనపై దౌర్జన్యం జరిగే ప్రమాదం ఉందని, అందువల్ల నాలుగు వారాల సమయం ఇవ్వాలని ఆమె అంతకు ముందు పోలీస్ అధికారులను కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News