Thursday, January 9, 2025

ప్రజ్వల్ రేవన్న పై ‘లుకౌట్ నోటీస్’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుని, పరారీలో ఉన్న ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై కర్నాటక సిట్  ‘లుకౌట్ నోటీస్’ జారీచేసింది. హసన్ ఎంపీ అయిన ప్రజ్వల్ కేసు రచ్చ మొదలు కాగానే విదేశాలకు పారిపోయాడు. అతడు మాజీ ప్రధాని హెచ్ డి. దేవె గౌడ్ మనుమడు. ప్రస్తుతం అతడు జర్మనీ లో ఉన్నట్లు వినికిడి. అతడు ఇండియాలో దిగగానే ఏ విమానాశ్రయం, రేవు పట్టణం, సరిహద్దుల చెక్ పోస్ట్ లో నైనా వెంటనే అరెస్టు చేస్తారు.

ప్రజ్వల్ రేవన్న ఏప్రిల్ 27న దేశం వదిలి పారిపోయాడు. అతడు తన డిప్లోమేటిక్ పాస్ పోర్ట్ పైన విదేశాల్లో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. అతడు పారిపోయిన నాడే ఎఫ్ఐఆర్ నమోదయింది.

కర్నాటక లో జెడి(ఎస్) ప్రజ్వల్ రేవన్న ను సస్పెండ్ చేసింది. పార్టీ ప్రతిష్టకు దెబ్బ అన్న కారణంగానే అతడిని సస్పెండ్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News