Sunday, April 13, 2025

మా బిడ్డను ఆంజనేయస్వామి కాపాడాడు: చిరంజీవి

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ‘మా బిడ్డ మార్క్‌ శంకర్ ఇంటికొచ్చేశాడు. మార్క్ శంకర్ ఇంకా కోలుకోవాలి. ఆంజనేయస్వామి దయతో త్వరలో పూర్తి ఆరోగ్యంతో ఉంటాడు. పెద్ద ప్రమాదం నుంచి మా బిడ్డను ఆంజనేయస్వామి కాపాడాడు. మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రార్థించినవారందరికీ ధన్యవాదాలు’ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

పవన్‌కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సింగపూర్‌లోని ఓ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో అతని చేతులు, కాళ్లకు స్వల్పగాయాలు కాగా.. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరి అతను ఇబ్బందిపడ్డాడు. దీంతో మార్క్ త్వరగా కోలుకోవాలని పలువురు సెలబ్రిటీలతో పాటు.. పవన్‌ అభిమానులు పెద్ద ఎత్తున కోరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News