Monday, December 23, 2024

శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన లొంక రామలింగేశ్వర స్వామి దేవాలయం

- Advertisement -
- Advertisement -

సిరికొండ: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి 7కిలో మీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన లొంక రామలింగేశ్వర స్వామి దేవాలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలలను ప్రతి ఏట 18,19,20 తేదీలలో ఆలయ కమిటీ నిర్వహిస్తోంది. శ్రీరామ చంద్రుడు అరణ్యవాసం సంద్బంగా లొంక అటవీ ప్రాంతంలో సంచరించినట్టు భక్తులు నమ్ముతారు. శ్రీరామ చంద్రుడు ఈప్రాంతంలో సంచరిస్తున్న సమయంలో పూజలు చేయడానికి లొంక రామలింగేశ్వర స్వామి దేవాలయంలో తన స్వంత చేతులతో ఇసుక లింగాన్ని తయారు చేసి ప్రతిష్టించాడని భక్తుల నమ్మకం. పూజలు చేయడానికి ముందు స్నానాలు ఆచరించడానికి స్వయంగా పుష్కరిణిని నిర్మించుకున్నట్లు భక్తులు విశ్వసిస్తారు. ఫుష్కరినిపైన ఆంజనేయ స్వామి కొలువుదీరాడు. సంతానలేమితో బాదపడుతున్న వారు కోనేరులో పుణ్య స్నానమాచరించి ఆంజనేయ స్వామికి మొక్కుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతందని భక్తుల విశ్వాసం.

Lord Shiva temples decked up for Shivaratri festivalలొంక రామస్వామి ఆలయం ఎడమ పక్కన అల్లు బండ వుంది. దైవ దర్శనం తర్వాత భక్తులు అల్లుబండ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తమ మనుసులో కొరికలను తలుచుకొని అల్లు బండపైన రెండు బొటవేళ్లు పెడితే అవి వాటంతటఅవే కదిలి బండ చుట్టు తిరుగుతాయి. దీంతో తమ కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. స్వామివారి దర్శనం కంటే ముందు భక్తులు కొనేరులో పుణ్య స్నానమాచరించిన తర్వాత దైవదర్శనం చేసకుంటారు. పుణ్య స్నానమాచరించిన వెంటనే కోనేరు పైనబండ పైన వున్న శ్రీరామచంద్రుడు పాదాలుగా భావించే పాదముద్రలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

మహాశివరాత్రి సందర్బంగా శివరాత్రి రోజు అర్ధరాత్రి నిర్వహించే నిశిపూజ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. అనంతరం జరిగే అన్న పూజ కార్యక్రమం లో పాల్గొనే భక్తులు ఉపవాసదీక్షను విరిమిస్తారు. శివరాత్రి సంద్బంగా నిర్వహించే ఉత్సవాల్లో నిజామాబాద్, కామారెడ్డి, అదిలాబాద్, కరీంనగర్ ఉమ్మిడి జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. ఉత్సవాలలో పాల్గొనడానికి వచ్యే భక్తుల కోసం టిఎస్ ఆర్టీసి వారు సిరికొండ నుండి ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తారు. శివాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తలకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నదానం కోసం సత్రం ఏర్పాటు చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News