Thursday, January 23, 2025

అయోధ్య రామాలయంలో “కోదండపాణి”లా రామ విగ్రహం

- Advertisement -
- Advertisement -

అయోధ్య: అయోధ్యలో నిర్మాణమౌతున్న రామాలయంలో రాముని విగ్రహం రూపు రేఖలు ఏ విధంగా రూపొందించాలో శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కృష్ణశిలతో ఐదు అడుగుల ఎత్తులో ఈ విగ్రహం మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేస్తారు. అయితే రాముడు ఐదేళ్ల వయసులో విల్లు, అమ్ములు ధరించి కోదండపాణిలా నిలుచుని ఉన్నట్టు రూపురేఖలు ఉంటాయి.

ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన సమావేశం మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా విగ్రహం రూపురేఖలు ఏ విధంగా ఉండాలో నిర్ణయించినట్టు ట్రస్ట్ సభ్యుడు స్వామీ తీర్థ ప్రసన్నాచార్య బుధవారం తెలియజేశారు. ఈమేరకు సాధువులు, భౌగోళిక శాస్త్రవేత్తలు, శిల్పులు, ట్రస్ట్ సభ్యులతో చర్చించి నిర్ణయించడమైందని, దీని ప్రకారం విగ్రహం తయారీకి శిల్పి కృష్ణశిలను ఎంపిక చేస్తారని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపట్ రాయ్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News