Wednesday, January 22, 2025

స్వ‌ర్ణ‌ ర‌థంపై శ్రీవారి ఊరేగింపు

- Advertisement -
- Advertisement -

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తజనం మధ్య తిరుమలేశుడు స్వర్ణ రథంపై తిరువీధుల్లో విహరించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణ రథంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. వైకుంఠ ఏకదశి సందర్భంగా తిరుమలకు భక్తులు తాకిడి పెరిగింది. పలువురు ప్రముఖులు ఇప్పటికే శ్రీవారని దర్శించుకున్నారు. ధనుర్మాసం నేపథ్యంలో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతో పాటు వేంకటేశునికి కైంకర్యాలు పూర్తి చేశారు అర్చకులు. జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. టోకెన్లు తీసుకున్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని తెలిపారు. ద్వాదశి సందర్భంగా ఆదివారం తిరుమల వెంకన్న స్వామికి చక్రస్థానం చేయించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News