Monday, December 23, 2024

తవ్వకాల్లో దొరికిన విష్ణుమూర్తి విగ్రహం.. అచ్చం బాలరాముడిలానే ఉన్నాడే!

- Advertisement -
- Advertisement -

కర్నాటకలోని రాయ్ చూర్ సమీపంలో కృష్ణా నది ఒడ్డున విష్ణుమూర్తి విగ్రహం ఒకటి పురావస్తు అధికారులకు దొరికింది. విశేషం ఏమిటంటే… ఈ విగ్రహం అయోధ్య రామాలయంలో ఇటీవల ప్రతిష్ఠించిన బాల రాముడి విగ్రహాన్ని పోలి ఉండటం. విష్ణుమూర్తి విగ్రహానికి చుట్టూ ఉన్న అమరికపై దశావతారాలు చెక్కి ఉన్నాయి.

నల్లరాతిపై చెక్కిన విష్ణుమూర్తి విగ్రహం కొన్ని వందల ఏళ్ల క్రితం నాటిదని భావిస్తున్నారు. దీంతోపాటు ఒక శివలింగం కూడా లభించింది. రాయ్ చూర్ యూనివర్శిటీలో చరిత్ర, ఆర్కియాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ పద్మజ దేశాయ్ మాట్లాడుతూ అప్పట్లో ఈ విష్ణుమూర్తి విగ్రహం ఏదైనా ఆలయం గర్భగుడిలో ఉండి ఉండవచ్చనీ, ఆలయాన్ని ధ్వంసం చేసే ప్రమాదం ఉందని భావించి, విగ్రహాన్ని కృష్ణానదిలో నిమజ్జనం చేసి ఉండవచ్చనీ అభిప్రాయపడ్డారు. ఈ విగ్రహం 11 లేదా 12వ శతాబ్దానికి చెందినదై ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News