Wednesday, January 22, 2025

రక్షణ తయారీ రంగంలో ప్రవేశించిన లార్డ్స్‌ మార్క్‌ ఇండస్ట్రీస్‌

- Advertisement -
- Advertisement -

ముంబై: వైవిధ్యమైన వ్యాపార గ్రూప్‌, లార్డ్స్‌ మార్క్‌ ఇండస్ట్రీస్‌ బ్రహ్మాస్త్ర డిఫెన్స్‌ టెక్నో ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ ను ప్రారంభించడం ద్వారా రక్షణ తయారీ రంగంలో ప్రవేశించింది. భారత ప్రభుత్వ పూర్వ కార్యదర్శి ; ఆటమిక్‌ ఎనర్జీ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా పూర్వ ఛైర్మన్‌ శ్రీ అనిల్‌ కకోదర్‌ ఎడ్వైజీ బోర్డ్‌లో అత్యంత కీలకమైన సభ్యునిగా ఉండేందుకు అంగీకరించారు. తద్వారా నూతన వెంచర్‌ కోసం రక్షణ సాంకేతికను నిర్మించేందుకు తగిన వ్యూహాత్మక మార్గదర్శకం ఆయన చేయనున్నారు.

ముంబై కేంద్రంగా కార్యక్రమాలను నిర్వహి స్తోన్న ఈ గ్రూప్‌ ఆర్‌ అండ్‌ డీ మరియు 25వేల చదరపు అడుగుల రక్షణ తయారీ సదుపాయాలను మాపీలో నిర్మించేందుకు 50 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ యూనిట్‌కు తొలుత 200 కోట్ల రూపాయల ఆదాయం సృష్టించే ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. ఈ కంపెనీ వైవిధ్యమైన రిఫ్లెక్స్‌ సైట్స్‌ (హోలోగ్రాఫిక్‌ సైట్స్‌), థర్మల్‌ ఇమేజింగ్‌ సైట్స్‌, టెలిస్కోపిక్‌ సైట్స్‌, సర్వైవలెన్స్‌ సిస్టమ్‌ (హెచ్‌హెచ్‌టీఐలు మరియు ఇతర డే/నైట్‌ అన్‌కూల్డ్‌ కెమెరాలు), యాంటీ డ్రోన్‌ వ్యవస్ధలు ఉంటాయి. ఈ నూతనంగా ప్రారంభమైన కంపెనీ రక్షణ రంగంలో సుప్రసిద్ధ ఎగుమతి దారునిగా నిలువడం లక్ష్యంగా చేసుకుంది.

నూతన తయారీ యూనిట్‌ గురించి లార్డ్స్‌ మార్క్‌ ఇండస్ట్రీస్‌ ఫౌండర్‌ శ్రీ సచిదానంద ఉపాధ్యాయ్‌ మాట్లాడుతూ ‘‘అంతర్జాతీయ రక్షణ సాంకేతికత, ఉత్పత్తులను అభివృద్ధి చేయడంతో పాటుగా ఎగుమతి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మా లక్ష్యం ఉండటం పట్ల ఆనందంగా ఉంది. మా రక్షణ తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల సంతోషంగా ఉంది. రక్షణ ఉత్పత్తిలో సాంకేతిక ఆవిష్కరణలను అర్థం చేసుకోవడం మరియు అమలు చేయడంలో భారత్‌ స్వీయ సమృద్ధి సాధించేలా చేయడంలో మాదైన తోడ్పాటు ఇది. యాంటీ డ్రోన్‌ వ్యవస్ధలను నిర్మించి,అమలులోకి తీసుకువచ్చిన అతి కొద్ది కంపెనీలలో ఒకటిగా, అన్ని కోణాల్లోనూ మా నిఘా ఉత్పత్తులు అత్యున్నతంగా ఉన్నాయని మేము పూర్తి నమ్మకంతో ఉన్నాము’’ అని అన్నారు.

ఈ ముంబై కేంద్రంగా కలిగిన రక్షణ కంపెనీ ఇప్పటికే ఇజ్రాయిల్‌ –కేంద్రంగా కలిగిన ఎంసీ టెక్‌ మరియు జపాన్‌ కేంద్రంగా కలిగిన దేవ్‌టెక్‌తో భాగస్వామ్యం చేసుకుంది. ఇక్కడ తయారు చేసే ఉత్పత్తులు అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉన్నాయి. వీటిని భారతదేశంలో సహేతుకమైన ఉత్పత్తి మరియు అభివృద్ధి వ్యయాలలో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కంపెనీ ఇప్పుడు అత్యున్నత నాణ్యత కలిగిన రక్షణ ఉత్పత్తులను భారత ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ, కోస్టల్‌ గార్డ్‌, పోలీస్‌, బీఎస్‌ఎఫ్‌, ఇతర సెక్యూరిటీ సేవల కోసం ఇండియాతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా అందిస్తుంది.

ఈ కంపెనీని లార్డ్స్‌ మార్క్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మరియు ఆర్‌ఆర్‌పీ ఎస్‌4ఈ ఇన్పోవేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోట్‌ చేస్తున్నాయి. ఆర్‌ అండ్‌ డీ ఆధారిత డిఫెన్స్‌ తయారీ కంపెనీ బ్రహ్మాస్త్ర డిఫెన్స్‌ టెక్నో ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌. దీనిని అంతర్జాతీయ కోణంలో రక్షణ ఉత్పత్తులను భారతదేశంలో తయారుచేయడాన్ని ప్రోత్సహిస్తూ నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ 200 మందిని ఉద్యోగాలలోకి తీసుకోవడానికి ప్రణాళిక చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News