Thursday, November 21, 2024

కూలీల ఆటోను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

కూలీల ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఉండవెల్లి ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా తాండ్రపాడుకు చెందిన కూలీలు ఆటోలో డ్రైవర్ 17 మంది కూలీలతో మహబూబ్‌నగర్ జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామ శివారులోని మిరప పంటలో కలుపు పనులకు వస్తుండగా 44 నెంబర్ జాతీయ రహదారిపై వరసిద్ధి వినాయక పత్తి మిల్లు సమీపంలో కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు ముందుగా వెళ్తున్న ఆటోను లారీ వెనుకాల నుండి లారీ ఢీకొంది.

దీంతో ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న బెస్త లక్ష్మీదేవి (56) తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన రమాదేవిని హైవే అంబులెన్స్‌లో కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి రమాదేవి (40) మృతి చెందినట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ నరసింహులు, అనితకు తీవ్ర గాయాలు కాగా మరో 13 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరు కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ప్రత్యక్ష సాక్షి నందు ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News