Monday, December 23, 2024

లారీ,బైక్ ఢీ

- Advertisement -
- Advertisement -

చేగుంట : చేగుంట మండలం చిన్నశివునూర్ గ్రామ శివారులోని బైపాస్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి 11 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడి కక్కడే దుర్మరణం చెందారు. ఎస్‌ఐ ప్రకాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రంలోని జాతీయ రహదారి44 బైపాస్‌లో ఎదురు గా రాంగు రూటులో వస్తున్న కంటేనర్ లారీ ఎదురుగా వెలుతున్న బైక్ ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో బైక్‌పై వెలుతున్న ఇద్దరు యువకులు అక్కడి కక్కడే మృతి చెందినట్లు తెలిపారు .చేగుంట నుండి మక్కరాజిపేట వెళ్లే రహదారి సిసి రోడ్డు నిర్మాణం చేస్తున్నందున వాహనాల మల్లింపు చేపట్టారు. వాహనాల మళ్లింపు వల్లే ఎదురు ఎదరుగా వచ్చి ఢీకోట్టుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. చనిపోయిన యువకులు రామాయంపేట మండలం జాన్సి లింగాపూర్ గ్రామానికి చెందిన కోళ్ల రవితేజ(20), బాలాజీ సింగ్ (35) గా ఎస్ ఐ ధృవీకరించారు. ప్రమాదం గురువారం రాత్రి 11 గంటలకు జరిగిందని తెలిపారు. మృతులను ఎరియా అసుపత్రికి తరలించి రాకుర్ పద్మబాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐతెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News