Friday, April 4, 2025

భద్రాద్రిలో ఆర్‌టిసి బస్సును ఢీకొట్టిన లారీ…

- Advertisement -
- Advertisement -

చుంచుపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చుంచుపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనందని గ్రామ శివారులో లారీ అతివేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో 43 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. టిఎస్‌ఆర్‌టిసి బస్సు 47 మంది ప్రయాణికులతో భద్రాచలం నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు రెండు పల్టీలు కొట్టి బోల్తాపడింది. క్షతగాత్రులు విజయవాడ, నూజివీడు, భద్రాచలం, కొత్తగూడెంకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఢిల్లీ మెట్రోలో వ్యక్తి హస్త ప్రయోగం: అరెస్టుకు మహిళా కమిషన్ ఆదేశాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News