- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం తాడిపత్రిలో రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. బొందలదిన్నె గ్రామ శివారులో కారును లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బెదరగుట్టపల్లి గ్రామానికి చెంది ప్రతాప్ రెడ్డి(25), వెంకటలక్ష్మి(45), ప్రమీల(22)లతో కలిసి రిసెప్షన్ కోసం వేంపల్లి గ్రామానికి వెళ్లారు. తిరిగి సొంతూరుకు వస్తుండగా బెదరగుట్టపల్లి సమీపంలో కారును లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలో ప్రతాప్‌రెడ్డి, ప్రమీల దుర్మరణం చెందగా తీవ్రంగా గాయపడిన వెంకట లక్ష్మిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. వెంకట లక్ష్మి అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -