Sunday, January 19, 2025

కారును ఢీకొట్టిన లారీ.. ఇద్దరు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం శివారులో గురువారం తెల్లవారుజామున చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై అతి వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ కంట్రోల్ తప్పి మందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. కారు, విశాఖ నుంచి వస్తుండగా లారీ ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతులు బాపట్ల జిల్లా కోటపాడుకు చెందిన మార్క్‌(25), మేరీ(38)లుగా గుర్తించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News