Sunday, January 5, 2025

విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున భోగాపురం మండలం పోలిపల్లి జాతీయ రహదరాపై లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆస్పత్రిక తరలించగా.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ  ప్రమాదంలో చనిపోయిన వారంతా శ్రీకాకుళం పట్టణానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News