Monday, January 20, 2025

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్ : మండలంలోని మేకలగండి సమీపంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సురేష్ ( 35) అనే లారీ డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం …. హైదరాబాద్ నుండి మహారాష్ట్రలోని వణికి కార్బెట్ పౌడర్‌తో వెళ్తున్న లారీ టైరు మేకలగండి సమీపంలో పగిలిపోవడంతో డ్రైవర్ సురేష్ టైరు మార్చేందుకు కిందికి దిగాడన్నారు. టైరు మారుసున్న క్రమంలో ఆదిలాబాద్ వైపు వెళ్తున్న వ్యాగనార్ వాహనం అతడిని ఢీ కొనడంతో తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా తెల్లవారు జామున ఐదు గంటల సమయంలో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని వద్ద దొరికిన ఆధారాల ప్రకారం మృతుడు మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన వాడని, అతని కు టుంబ సభ్యులకు సమాచారం అందించామని,మృతదేహాన్ని రిమ్స్ శవగారంలో భద్రపర్చినట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News