Monday, December 23, 2024

పెద్దపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

- Advertisement -
- Advertisement -

Road accident on Film Nagar

పెద్దపల్లి: తెలంగాణలో రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని లారీ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి లారీని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గపాడు మండలం సారపాక పెట్రోల్ బంకు వద్ద కారు ఇంజన్‌లో నుంచి మంటలు రావడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News