Wednesday, January 22, 2025

ఎపిలో విషాదం.. ఇంటిముందు ముగ్గులు వేస్తున్న అక్క, చెల్లెలిపైకి దూసుకెళ్లిన లారీ..

- Advertisement -
- Advertisement -

ఏపీలో భోగీ పండుగ పూట విషాద సంఘటన చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా మండవల్లి మండలంలోని కానుకొల్లు గ్రామంలో ముగ్గు వేస్తున్న ఇద్దరు అక్క, చెల్లెలిని వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పంగిళ్ల తేజస్విని(17) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో యువతి పల్లవిదుర్గ(18)కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో లారీ డ్రైవర్ పరిపోగా.. మరో వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు.

గాయపడిన పల్లవిదుర్గను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పట్టుకున్న వ్యక్తిని గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News