Monday, December 23, 2024

బైక్ ను ఢీకొట్టిన లారీ..ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బైక్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వైఎస్ ఆర్ జిల్లా కమలాపురం మండలం పందిళ్లపల్లి వద్ద చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా పొన్నలూరు గ్రామానికి చెందిన బింగి మహేశ్(31), బింగి చిన్నమోహన్ (30) నల్లలింగాయపల్లెలో తాపీమేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

కాగా సోమవారం తెల్లవారుజామున బైక్ పై పెట్రోల్ తీసుకుని వెళ్తుండగా పందిళ్ల పల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News