- Advertisement -
మేడ్చల్ జిల్లా కీసరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం కీసర పరిధిలో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ, ద్వాచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటాస్థలానికి చేరుకుని పరిశీలించి లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన యువకులను చేర్యాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
- Advertisement -