Sunday, December 22, 2024

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

 

రాయపోల్: సిద్దిపేట జిల్లా రాయపోల్ లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులను రాయపోల్ కు చెందిన లావణ్య, కవితగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News