- Advertisement -
మన తెలంగాణ/సుల్తానాబాద్: పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఓవర్ లోడ్‌తో వస్తున్న ఇసుక లారీ బుధవారం ఢీకొట్టిన సంఘటనలో అన్నాడి బుచ్చవ్వ(70) అక్కడిక్కడే మృతి చెందింది. జన సందడిగా ఉండే ఈ చౌరస్తాలో ఇసుక ఓవర్ లోడుతో ఉన్న లారీ ప్రజలపై దూసుకుపోయిన ఘటన ఇది రెండోది కాగా, ఒకసారి అదుపుతప్పి రోడ్డు పక్కకు వచ్చింది.
ఈ ఘటనలో బుచ్చవ్వ శవం రోడ్డు మీద నుంచి తీయడానికి వీలు లేనివిధంగా నుజ్జునుజ్జుగా మారింది. ఈ మేరకు లారీ వేగం ఎంతలా ఉందో ప్రమాద దృశ్యం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. మృతురాలు అల్లిపూర్ గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ ప్రమాదం జరగడంతో లారీని అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఉపేందర్ తెలిపారు.
- Advertisement -