Monday, January 20, 2025

చెరుకు ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ..

- Advertisement -
- Advertisement -

కొత్తకోట : పట్టణ కేంద్ర సమీపంలోని టెక్కలయ్య దర్గ వద్ద ఎన్‌హెచ్ 44పై శనివారం ఉదయం చెరుకు ట్రాక్టర్‌ను లారీ బలంగా ఢీకొట్టింది. చెరుకు ట్రాక్టర్ టెక్కలయ్య దర్గా నుండి బైపాస్ రోడ్డులో వచ్చి జాతీయ రహదారిపైకి ఎక్కగానే హైదరాబాద్ నుండి కర్నూల్ వైపు వెళ్తున్న లారీ వెనుక నుండి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.

దీంతో ట్రాక్టర్ ను లారీ కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. కాగా డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని హైవే పోలీసులు తెలిపారు.  ఈ ఘటనతో సుమారు గంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది.అనంతరం పోలీసులు వావనాలను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News