Thursday, December 26, 2024

ట్రాక్టర్ ను ఢీకొట్టిన లారీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖమ్మం జల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .జిల్లాలోని పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద వరి గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను లారీ అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పై ఉన్న 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కాగా గాయపడిన వారిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద బాధితులంతా నాయకులగూడెం కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News