Wednesday, January 8, 2025

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ..మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… ఇబ్రహీంపట్నం మున్సిపల్‌కు చెందిన వరికుప్పల ఎల్లమ్మ ఆమె భర్త కిష్టయ్య ద్విచక్ర వాహనంపై జిరాక్స్ సెంటర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా బస్టాండ్ సమీపంలోని సాగర్‌రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఎల్లమ్మ లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్తకు తీవ్ర గాయాలు కావటంతో ఆసుపత్రికి తరలించారు. వరికుప్పల చంటి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వెంటనే కేసు నమోదు చేసి లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News