- Advertisement -
సదాశివనగర్ మండల కేంద్ర సమీపంలో 44 వ జాతీయ రహాదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయని ఎస్ఐ రంజీత్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన లింగాపురం రవి (36) అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై కామారెడ్డి వైపు నుండి ఇంటికి వెళుతుండగా సదాశివనగర్ గ్రామ పరిధిలో జాతీయ రహాదారిపై ప్రమాదం జరిగిందన్నారు. వారు వెళుతున్న బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో రవి అక్కడికక్కడే మరణించగా భార్య పిల్లలకు గాయాలయినట్లు తెలిపారు. క్షతగాత్రుల ను ఆంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు.
- Advertisement -