- Advertisement -
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం జహీరాబాద్ బైపాస్ రోడ్డు వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుత తప్పి ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదం 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు అల్గోల్ చౌరస్తా దాటుతుండగా వెనకవైపు నుంచి వచ్చి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -