Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

భువనగిరి క్రైమ్: యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ శివారులో నేషనల్ హైవే 163 రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు,స్థానికుల సమాచారం మేరకు హైవే రోడ్డుపై చెట్లకు నీళ్లు పోస్తున్న రోజు వారీ కూలీ రోడ్డుపై ఉన్న చెట్లకు,ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోస్తు ఉండగా లారీ అతివేగంతో వచ్చి అదుపుతప్పి ట్యాంకర్ ను ఢీకొనగా అక్కడే ఉన్న రోజు వారీ కూలీ తలకు బలమైన గాయలై అధికంగా రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

కాగా లారీ నడుపుతున్న డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. మృతుడు కేసారం గ్రామానికి చెందిన కాసేపాక ఐలయ్యగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News