Wednesday, April 2, 2025

వడ్ల బస్తాల లారీ బోల్తా..

- Advertisement -
- Advertisement -

బిక్కనూర్ : బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామ సమీపంలో శనివారం రాత్రి వడ్ల బస్తాల లారీ బోల్తా పడింది. పెద్ద మల్లారెడ్డి గ్రామ సొసైటీ పరిధిలోని భగీరథపల్లి గ్రామానికి చెందిన రైతుల వరి ధాన్యాన్ని పెద్దమల్లారెడ్డి రైస్‌మిల్ కు తరలిస్తుండగా గ్రామ శివారులోని గంగమ్మ ఆలయం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న సింగిల్విండో చైర్మన్ బాలగోని రాజాగౌడ్ ఘటనా స్థలానికి వడ్ల బస్తాలను మరో లారీలో ఎక్కించి రైస్‌మిల్ కు తరలించారు. ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News