Monday, December 23, 2024

డ్రైవర్ నిద్రమత్తు… కాలువలో లారీ బోల్తా, ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

బాపట్ల: డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కాలువలో లారీ బోల్తా పడిన ఘటన ఆంద్రప్రదేశ్ లోని బాపట్లలో శనివారం ఉదయం జరిగింది. మాచర్ల నుంచి రేపల్లేకు నాపరాయి తీసుకెళ్తుండగా బాపట్ల రేపల్లే మండలం రావిఅనంతవరం శివారులో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రేపల్లే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన వారిగా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News