Sunday, December 22, 2024

ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద లారీ బీభత్సం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మంగళవారం ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గర వేగంగా వచ్చి ఓ లారీ, ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారు..టోల్ ప్లాజా కౌంటర్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

లారీ డ్రైవర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు టోల్ ప్లాజా సిబ్బంది, కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News