Saturday, November 23, 2024

హైకోర్టు లాయర్ కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన లారీ

- Advertisement -
- Advertisement -

న్యాయవాది దుర్గాప్రసాద్ సురక్షితం ప్రమాదం కాదు హత్యా
ప్రయత్నమే : దుర్గాప్రసాద్ బ్రేకులు ఫెయిలయ్యాయి : డ్రైవర్

మన తెలంగాణ/హైదరాబాద్/జనగామ టౌన్: హైకోర్టు అడ్వకేట్ దుర్గాప్రసాద్ కారును ఓ లారీ ఢీకొట్టింది. దుర్గాప్రసాద్ హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వస్తుండగా జనగామ జిల్లా యశ్వంత్‌పూర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న కారును వెంబడించి జనగామ హైవేలో యశ్వంత్‌పూర్ వద్ద లారీ ఢీకొట్టింది. కారును 200 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లింది. ప్రమాదం నుంచి న్యాయవాది దుర్గాప్రసాద్ సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని ఈ ప్రమాదంపై నిలదీయగా బ్రేక్ ఫెయిల్ అయినట్లు పొంతనలేని సమాధానం చెప్పాడు. ఇటీవలే రాష్ట్రంలో ఓ హైకోర్టు లాయర్ దంపతుల హత్య కలకలం రేపుతుండగా.. మరో హైకోర్టు లాయర్ కారును వెంబడించి మరీ లారీని ఢీకొట్టడం పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దుర్గా ప్రసాద్‌ను ఎవరైనా హత్య చేయాలనే ఈ ప్లాన్ వేశారేమో.. అని ప్రమాదం జరిగిన చోట స్థానికులు అంటున్నారు.
ఇలాగైతే న్యాయవాద వృత్తిని వదులుకోవాలి ః లాయర్ దుర్గాప్రసాద్
ఇది ప్రమాదం కాదని.. తనను హత్య చేయడానికి జరిగిన ప్రయత్నమని లాయర్ దుర్గాప్రసాద్ ఆరో పించారు. ‘లారీతో ఢీకొట్టి తనను చంపే ప్రయత్నం చేశారు. భూవివాదం కేసులో హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న నన్ను జనగామ నుంచి ఓ లారీ వెంబడించింది. నా కారును ఢీకొట్టడమే కాకుండా.. 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. లారీ ఇంజన్ ఆగడం వల్ల దుండగులు పారి పోయేందుకు ప్రయత్నించారు. స్థానికులు దుండగులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. బ్రేక్ ఫెయిలే కారణమని దుండగులు అబద్ధం చెబుతున్నారు. ఇలాగైతే న్యాయవాద వృత్తిని వదులుకోవాల’ని హైకోర్టు న్యాయవాది దుర్గాప్రసాద్ తెలిపారు. ప్రమాదంపై హైకోర్టు న్యాయవాది దుర్గాప్రసాద్ జనగామ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. న్యాయవాది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Lorry Rammed into High Court Lawyers Car

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News