Wednesday, January 22, 2025

లారీ, ఆర్టీసీ బస్సు ఢీ..

- Advertisement -
- Advertisement -

దామెర: రోడ్డు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామ పరిధిలోని ఎస్‌బీఐటీ వద్ద పరకాల నుంచి హన్మకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. కాగా ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో బస్సు క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను స్థానికులు, పోలీసులు బయటకు తీసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ములుగు హన్మకొండ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News