Monday, December 23, 2024

ఆర్‌టిసి బస్సుకు తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

తెలంగాణా ఆర్‌టిసి బస్సుకు ప్రమాదం కొద్దిలో తప్పింది. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లాలో టిజిఎస్‌ఆర్‌టిసి బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం తప్పిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన సిసిటివి ఫుటేజ్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జాతీయ రహదారి 44పై నేరడిగొండ మండలం నిర్మల్ ఎక్స్ రోడ్ వద్ద ఆర్‌టిసి పల్లె వెలుగు బస్సు రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలో అటు వైపు నుంచి వస్తున్న లారీ డ్రైవర్ అప్రమత్తమై సడెన్‌గా సైడ్ తీసుకోని బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి క్షణకాలంలో లారీ స్పీడును కంట్రోల్ చేసి కుడి వైపునకు తిప్పడంతో బస్సు చివరి భాగంలో కొంతమేర డ్యామేజ్ అయ్యింది.

అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. జస్ట్ మిస్సయింది, డ్రైవర్ అంత మంది జనాల ప్రాణాలను పణంగా పెట్టాడు, ఆ బస్ డ్రైవర్ రెండు నిమిషాలు ఆగి రోడ్డు దాటితే, తప్పేముందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. తెలంగాణ పోలీసులు మామూలు వాహన చోదకులతో పాటు ఇలాంటి ఆర్‌టిసి డ్రైవర్‌ల కోసం కూడా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని మరో నెటిజన్ సూచించారు. ఈ ఘటనపై ఆర్‌టిసికి ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేయడంతో సంస్థ స్పందించింది. నిర్మల్ డిఎం, ఆదిలాబాద్ రిజినల్ మేనేజర్ ఎక్స్ వేదికగా ట్యాగ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News