అమరావతి: భారీ వర్షాలు అనంతపురం జిల్లాను ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని కాలనీలు వరద నీటితో మునిగిపోయాయి. జిల్లాలోని బుక్కరాయ సముద్రం చెరువు వద్ద వాగులో లారీ ట్యాంకర్ కొట్టుకుపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువుకు వరద ప్రవాహం ఎక్కువైంది. అనంతపురం వైపు నుంచి వస్తున్న వరదకు మరువ కాలువ పొంగి ప్రవహిస్తుండగా, మరువ కాలువ దాటుతుండగా లారీ కొట్టుకుపోయింది. అనంతపురం నగరం భారీగా వరద ప్రవాహాన్ని ఎదుర్కొంటోంది. దీంతో పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. అనంతపురం నగరంలోని దాదాపు 18 కాలనీలు జలమయమైనట్లు తెలుస్తోంది. అనంతపురంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. వరద బాధితులకు అండగా ఉండాలని అధికారులను సిఎం ఆదేశించారు.
వరద ఉదృతికి కొట్టుకుపోయిన భారీ ట్యాంకర్…
- Advertisement -
- Advertisement -
- Advertisement -