- Advertisement -
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి దూలపల్లి వెళ్లే రోడ్డులో ఫెవికల్ గమ్మ్ మరియు టెర్పెంట్ ఆయిల్ లోడ్ తో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ లారీని పక్కకు ఆపాడు. మంటల్లో లారీ పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది,పోలీసులు మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు ప్రమాదానికి గల కారణాలను కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -