న్యూయార్క్: అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో కార్చిచ్చు చెలరేగింది. గాలులు ఎక్కువగా వీస్తుండడంతో వేలాది ఎకరాలు ఇళ్లు, చెట్లు అగ్నికి బూడిదలాగా మారాయి. ది పాలిసాడ్స్ ప్రాంతంలో అగ్రి కీలలు ఎగిసి పడుతుండడంతో వేలాది ఙల్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. 3000 ఎకరాలలో సంపన్న వర్గాలు నివసించే విలాసవంతమైన భవనాలు భూడిదలా మారాయి. భద్రతా సిబ్బంది 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా మంది తన సామాగ్రి, వాహనాలకు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ప్రజలు రోడ్లపైకి రావడంతో లాస్ ఎంజెల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గాలులు గంటకు వంద కిలో మీటర్ల వేగంతో వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
కార్చిచ్చుపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందించారు. కార్చిచ్చు ఇళ్లు కోల్పోయిన వారికి అన్ని రకాలు సహాయలు చేస్తున్నామన్నారు. స్థానిక అధికారులతో శ్వేతసౌధం అధికారులు అప్‌డేట్లు తెలుసుకోవడంతో పాటు సహాయక చర్యలు ముమ్మరం చేశామన్నారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని జోబైడెన్ పేర్కొన్నారు.
13000 ఇళ్లకు కార్చిచు అంటుకుందని కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ మీడియాకు తెలిపారు. మరి కొన్ని చోట్లు కార్చిచ్చు వెలువడే అవకాశం ఉందన్నారు. శాన్ ఫెర్నాండో, బెవర్లీ హిల్స్, హాలీవుడ్ హిల్స్ ప్రాంతాలలో కార్చిచ్చు వ్యాపించినే అవకాశం ఉన్నట్టు సమాచారం. అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎయిర్స్ ఫోర్స్ విమానాల సహాయంతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. హాలీవుడ్ స్టార్స్ హెడీ మోంటాగ్, రీస్ విథర్సూన్ ప్రాట్, టామ్ హాంక్స్ తదితరుల నటుల ఇండ్లు కాలిపోయాయని స్థానిక మీడియా వెల్లడించారు.