Monday, December 23, 2024

మంచి మిత్రుడిని కోల్పోయా

- Advertisement -
- Advertisement -

చిన్నచింతకుంట : మక్తల్ మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి మృ తి చెందడంతో మంచి మిత్రుడిని కోల్పోయానని టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పల్కాపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సీతమ్మ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దయాకర్‌రెడ్డి నిత్యం ప్రజల మధ్యే ఉండి వారి సమస్యలను పరిష్కరించే వారన్నారు. దయాకర్‌రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆయన రాకతో పల్కాపూర్ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిపోయిం ది. పరామర్శించిన వారిలో చిన్నారెడ్డి సంపత్‌కుమార్, ఎర్రశేఖర్, జి. మధుసూదన్‌రెడ్డి, కాటం ప్రదీప్‌గౌడ్, కొండా ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News