సూరత్: గుజరాత్ రాష్ట్రలోని సూరత్ లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. సూరత్ లోని కోసాంబ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న రాజస్థాన్ కూలీలపైకి ట్రక్కు దూసుకెళ్లి, బన్స్‌వార జిల్లాకు చెందిన 15 మంది వలస కూలీలు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై ప్రధాని మోడీతోపాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆక్షాంచారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి కింద రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియో ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. గుజరాత్ సర్కార్ కూడా బాధితకుటుంబాలకు రూ. 2 లక్షలు ఇవ్వనున్నట్టు ఆ రాష్ట్ర సిఎం విజయ్ రుపాని వెల్లడించారు.
Ex-gratia of Rs 2 lakhs each from PMNRF (Prime Minister's National Relief Fund) would be given to the next of kin of those who have lost their lives due to the accident in Surat. Rs 50,000 each would be given to those injured: Prime Minister's Office (PMO) https://t.co/Qp7V0lYKss
— ANI (@ANI) January 19, 2021