Saturday, December 21, 2024

హైదరాబాద్ లేకపోవడంతో ఏటా రూ.13వేల కోట్ల నష్టం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర విభజన తరువాత ఎపి తలసరి ఆదాయం తగ్గిపోయింది

ప్రతి రాష్ట్రానికి హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలు ఉండాలి

ఎపి అసెంబ్లీలో సిఎం జగన్

మన తెలంగాణ/హైదరాబాద్ : 60 ఏళ్లు కష్టపడి హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించుకున్నామని, కానీ విభజనలో దానిని కోల్పోయామని సిఎం జగన్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎపి తలసరి ఆదాయం బాగా తగ్గిపోయిందని వెల్లడించారు. హైదరాబాద్‌ను కోల్పోయాక ఎపి ప్రతి ఏడాది రూ.13 వేల కోట్ల ఆదాయం నష్టపోతుందన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పై సిఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. ప్రతి రాష్ట్రానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలన్నారు. అందుకే పదే పదే విశాఖ ప్రస్థావన తీసుకొస్తానన్నారు.ప్రతి రాష్ట్రానికి ఓ ఆర్థిక నగరం ఉండాలన్నారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చామన్న సిఎం జగన్ ఐదు ప్రజా బడ్జెట్‌లు ప్రవేశపెట్టామన్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కరోనా లాంటి సంక్షో భం ఎప్పుడూ చూడలేదన్నారు. కోవిడ్ మహమ్మారి వల్ల కొన్ని ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోయాయన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గిందన్నా రు. ఈ మూడేళ్లలో రాష్ట్రం రూ.66 వేల కోట్లు నష్టపోయిందన్నారు.

గత ప్రభుత్వ అసమర్థ పాలన ప్రభావం రాష్ట్రంపై పడిందని ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు తగ్గాయన్నారు. ఈ పరిస్థితులన్నీ అధిగమించి రాష్ట్రంలో గొప్పపాలన అందించామన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొట్టడమే కాదు.. ప్రత్యేక హోదా అంశాన్ని కనీసం చట్టంలో కూడా చేర్చలేదని అన్నారు. చట్టంలో ఈ విషయాన్ని పేర్కొని ఉంటే కోర్టుకు వెళ్లి అ యినా ప్రత్యేక హోదా తెచ్చుకునేవాళ్లమని స్పష్టం చేశా రు. ఇలా రాష్ట్రాన్ని విభజించడమే కాకుండా, ప్రత్యేక హో దాను చట్టంలో చేర్చకపోవడంతో చాలా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ కారణంగానే మనపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్ప.. ప్రత్యేక హోదా దక్కడం ఎండమావిగానే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూ డా స్పష్టమైన మెజారిటీ రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. కనీసం మన సపోర్టుపై ఆధారపడే ప్రభుత్వం వస్తే అయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కుతుందేమోనని ఆశగా ఉందని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News