Sunday, November 17, 2024

భారీ వర్షాలకు తెలంగాణలో రూ.5438 కోట్ల నష్టం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రాధమికంగా వేసిన అంచనా ప్రకారం రూ.5438 కోట్లు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్ అండ్‌బి శాఖకు రూ.2362 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.175 కోట్లు, వ్యవసాయ పంట నష్టం రూ.415 కోట్లు, ఇరిగేషన్ శాఖకు రూ.629 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.170 కోట్లు, వైద్య ఆరోగ్యశాఖకు రూ.12 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.25 కోట్లు, పురపాలక శాఖకు రూ.1150 కోట్లు, ఇతర శాఖలు, ప్రజల ఆస్తుల నష్టం రూ.500 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 110 పునరావాస కేంద్రాలకు 4 వేల మందిని తరలించినట్లు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News