Sunday, December 22, 2024

జిఓ నెంబర్ 46తో గ్రామీణ యువతకు నష్టం

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : జీవో నెంబర్ 46తో క్యాడర్ 1 హైదరాబాద్, క్యాడర్ 2 ఉమ్మడి పది జిల్లాలలోని రూరల్‌లో ఉన్న యువతకు పోలీస్ శాఖ ఉద్యోగాల్లో నష్టం వాటి ల్లుతుందని క్యాడర్ వన్ ద్వారా హైదరాబాద్‌లో ఉన్న యువతకే ఎక్కువ పోలీస్ ఉద్యోగాలు వస్తున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. హైద రాబాద్‌లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఆదివారం ఎమ్మెల్యే గువ్వల బాల రాజు మాట్లాడుతూ జిఓ 46ను సవరించి పరిశీలించడం ద్వారా గ్రామీణ ప్రాంత యువకులకు పోలీస్ శాఖ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, తద్వారా ఆ దిశలో ప్రభుత్వం కొనసాగిస్తే యువత లబ్ధి పొందుతారని ఎమ్మెల్యే సూచించారు.

నల్లమల అటవి ప్రాంతంలో వాచర్లుగా విధులు నిర్వ హిస్తున్న ఆదివాసుల వారికి కూడా వేరే రాష్ట్రాల్లో జీఓల ఆధారంగా రెగ్యులరైజ్ చేస్తే అటవి ప్రాంతం రక్షించడంతో పాటు అటవిలోని జీవరాసులు సంర క్షించబడుతాయని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ జిఓను జారీ చేసి ఇక్కడ వాచర్లుగా పనిచేస్తున్న ఆదివాసులకు కూడా రెగ్యులరైజ్ చేయాలని అసెంబ్లీలో మాట్లాడడం ద్వారా యువకులు, ఆదివాసులు, గిరిజనులు అసెంబ్లీ సమావేశాల్లో యువతపై దృష్టి సారించి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మాట్లాడడం ద్వారా ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు నల్లమల ప్రాంత యువకులు హర్షం వ్యక్తం చేస్తూ కృతఙ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News