Sunday, December 22, 2024

నాడు తండ్రిని కోల్పోయా… ఇప్పుడు దేశాన్ని కోల్పోలేను

- Advertisement -
- Advertisement -

Lost my father to politics of hate: Rahul Gandhi

రాజకీయ ప్రవేశం తర్వాత తొలిసారి తండ్రి స్మారక చిహ్నం వద్ద రాహుల్

చెన్నె: దేశ ప్రజలను ఏకతాటిపైకి తేవడంతోపాటు దేశంలో బీజేపీయేతర శక్తి బలంగా ఉందని చాటి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న భారత్ జోడో యాత్ర బుధవారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ వరకు కొనసాగే ఈ పాదయాత్రకు ఆ పార్టీ అగ్రనేత , ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వం వహించనున్నారు. ఈ యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ తన తండ్రి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు.

బుధవారం ఉదయం తమిళనాడు లోని శ్రీ పెరంబుదూర్ లో ఉన్న రాజీవ్ స్మారకాన్ని రాహుల్ సందర్శించారు. తొలుత ఈ స్మారకం ప్రాంగణంలో మొక్కను నాటిన రాహుల్ , అనంతరం రాజీవ్ చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు. రాహుల్ వెంట కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్, కేఎస్ అళగిరి తదితరులు ఉన్నారు. రాజకీయ ప్రవేశం తరువాత రాహుల్ తన తండ్రి స్మారకాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ ఫోటోను రాహుల్ తన ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ “ విద్వేష , విభజన రాజకీయాల కారణంగా నేను నా తండ్రిని కోల్పోయాను. ఇప్పుడు నా దేశాన్ని కూడా కోల్పోవాలనుకోవడం లేదు. ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది. ఆశ భయాన్ని ఓడిస్తుంది. మనమంతా ఐక్యంగా ఉంటే దేన్నైనా అధిగమించవచ్చు” అని రాహుల్ రాసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News