Monday, January 20, 2025

ఆ లింక్ ఓపెన్ చేయగా.. ఖాతా నుంచి రూ. 4.10 లక్షలు మాయం

- Advertisement -
- Advertisement -

 

Bank account fraud

నేరేడ్మెట్: ఉద్యోగానికి ఆన్‌లైన్‌లో వచ్చిన లింక్‌ ఓపెన్‌ చేయగా, బ్యాంకు ఖాతా నుంచి రూ.4.10 లక్షలు మాయమయ్యాయి. ఈ  ఘటన నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ నరసింహాస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్‌మెట్‌ ఆకులనారాయణ కాలనీలో నివసించే పర్రే భాగ్యవతి, శ్రీనివాసుల కుమార్తె పర్రే  వైష్ణవి (20) ఇంటర్‌  పూర్తిచేసింది. ఈ నెల 15న ఇంటర్‌ అర్హతతో ఉన్న ఉద్యోగాల కోసం గూగుల్‌లో  సెర్చ్‌ చేసింది. ఈ క్రమంలో హెచ్‌టిపిపి మర్చంట్‌ సెంటర్‌ డాట్‌ కామ్‌లో తన దరఖాస్తును ఫోన్‌ నంబర్‌తోసహా అప్‌లోడ్‌ చేసింది. వెంటనే ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ. 4.10లక్షలు డెబిట్‌ అయినట్టు తన ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. మోసపోయానని గ్రహించిన వైష్ణవి విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. ఈనెల 19న వారు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News