హైదరాబాద్ : దసరా పండుగ సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల రిటైల్ చైన్ ‘లాట్ మొబైల్స్’ బంపర్ ఆఫర్లను ప్రకటించింది. లాట్ మొబైల్స్ డైరెక్టర్ ఎం. అఖిల్ ఆఫర్లను వివరించారు. దసరా పండుగ పురస్కరించుకుని కస్టమర్లు చేసే కొనుగోళ్లపై ఖచ్చితమైన బహుమతితో పాటు రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందిస్తున్న ట్టు ఆయన వెల్లడించారు. ఎంపిక చేసిన మోడల్ మొబైల్స్, ఇతర వస్తువుల కొనుగోళ్లపై జిరో డౌన్ పేమెంట్‌తో కూడిన రుణ సదుపాయం, 24 నెలల వ్యవధితో కూడిన నో కాస్ట్ ఇఎంఐ సౌకర్యాన్ని సంస్థ అందిస్తోంది.
రూ. 999కే స్మార్ట్‌వాచ్, సౌండ్ బార్ ఊఫర్‌తో కూడిన స్మార్ట్ టీవీ కాంబో ఆఫర్, అన్ని బ్రాండెడ్ యాక్సెసరీలు, ఇతర వస్తువుల కొనుగోళ్లపై 60 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ కూడా ఉంది. సంస్థ మరో డైరెక్టర్ సుప్రజ మాట్లాడుతూ, లాట్ మొబైల్స్ షోరూమ్‌లలో స్మార్ట్‌ఫోన్లు కొనడం ద్వారా లభించే ప్రయోజనాలపై కస్టమర్ల స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు. తమ షోరూమ్‌లో బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు రూ.8,999 ప్రారంభ ధర నుంచి లభిస్తాయని, అదే విధంగా ల్యాప్‌టాప్‌లు రూ.16,500 ప్రారంభ ధర నుంచి లభ్యమవుతాయని ఆమె తెలిపారు.